News January 2, 2026

వైరల్ వీడియోతో రాజుకున్న సింహాచలం వివాదం..

image

సింహాచలం ప్రసాదంలో నత్త ఉన్నట్లు వైరల్ అయిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రగా ఆలయ సిబ్బంది పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, తప్పు ఎవరిదని తేలితే కఠిన చర్యలు తప్పవని MLA గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని.. పులిహోరలో నత్త ఉందని చెబితే కేసులు పెడతారా? అంటూ YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News January 16, 2026

‘ఖమ్మం సభను విజయవంతం చేయండి’

image

పెద్దపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో CPI శత జయంతి ఉత్సవాల గోడపత్రికలను జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు బాలసాని లెనిన్, ఆరెపల్లి మానస్, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2026

సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

image

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.

News January 16, 2026

ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

image

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్‌లు కూడా. యాప్‌లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్‌గా ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు.