News January 2, 2026

మరో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న విశాఖ

image

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News January 13, 2026

NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

image

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్‌లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్‌లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్‌గల్‌లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్‌లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

News January 13, 2026

రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ కేసు!

image

AP: స్కిల్ <<18842559>>కేసులో<<>> CBN అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఈ కేసు కారణమైంది. CBN జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి రోడ్లపై నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనను పరామర్శించి TDPతో పొత్తును ప్రకటించారు. BJP కూడా కలిసిరావడంతో 2024లో కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.

News January 13, 2026

జనగామ మాజీ ఎమ్మెల్యే ఆస్తుల అటాచ్!

image

జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. జనగామలోని ఆరు ప్లాట్లు, చేర్యాలలోని స్థలాలను ఈ పరిధిలోకి తెచ్చారు. గతంలో ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి తనకు ఏమీ తెలియదని, తండ్రి చెప్పడంతోనే సంతకాలు చేశానని భవానీ రెడ్డి ఐటీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.