News January 2, 2026

ఏపీలో పెరిగిన GST వసూళ్లు

image

AP: డిసెంబర్‌లో రాష్ట్ర GST వసూళ్లు పెరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.78% ఎక్కువగా రూ.2,652 కోట్లు వసూలైంది. జాతీయ సగటును (5.61%) సైతం మించింది. దీంతో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్థూల వసూళ్లు రూ.3,137 కోట్లకు చేరాయి. SGST, IGST, పెట్రోలియం వ్యాట్‌, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.

Similar News

News February 21, 2026

అల్లూరి జిల్లాలో ఏడాదిగా జేసీ ఖాళీ

image

అల్లూరి జిల్లాలో సబ్ కలెక్టర్, ఆర్‌వో, పోస్టులు 5 నెలలుగా ఖాళీగా ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ పోస్టు దాదాపు ఏడాదిగా భర్తీ కాలేదు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు JC ఇన్‌చార్జ్ బాధ్యతలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC) ఎంవీఎస్ లోకేశ్‌కు RDO అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మరో అధికారికి ఇన్‌‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News February 21, 2026

ఇక గురుకులాల్లో తనిఖీలు

image

TG: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇకపై గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలను ఆకస్మికంగా సందర్శించాలని, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.