News January 2, 2026

తాండూర్: ముగ్గు వేస్తున్న మహిళపై వీధి కుక్క దాడి

image

తాండూర్ మండలం రేచినిలోని పోచమ్మవాడకు చెందిన మామిడి రాజేశ్వరిపై శుక్రవారం వీధి కుక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు రాజేశ్వరి ముగ్గు వేస్తున్న సమయంలో కుక్క దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. మహిళను చికిత్స నిమిత్తం108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 12, 2026

BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

image

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

News January 12, 2026

NZB: ‘ప్రజావాణికి అధికారులందరూ విధిగా హాజరు కావాలి’

image

‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆమె అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై మొత్తం 84 ఫిర్యాదులను అందజేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 12, 2026

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

image

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.