News January 2, 2026

నెల్లూరు కలెక్టర్ సరికొత్త ఐడియా..!

image

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.

Similar News

News January 12, 2026

నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

image

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.

News January 12, 2026

ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

image

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్‌గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News January 12, 2026

ఊర్లకు వెళ్లేవారు LHMS యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల కోరారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్‌ను వాడాలని సూచించారు. రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.