News January 2, 2026

తెలంగాణ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మన్యం జిల్లా వాసి

image

మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెళ్ళ గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్ -15 హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యింది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు నేడు విజయనగరం విజ్జి స్టేడియంలో జరుగుతున్న వన్డే ట్రోఫీలో తలపడుతోంది. శాన్వి తండ్రి ప్రవీణ్ కూడా రంజీ ప్లేయర్ కావడంతో ఆమెకు మరింత ప్రోత్సాహం తోడైంది. శాన్వి కెప్టెన్ కావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 14, 2026

‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ&రేటింగ్

image

డబ్బు కోసం జమిందారీ అమ్మాయితో పెళ్లి, ప్రెసిడెంట్ కావడం, ఆ తర్వాత హీరోకు ఎదురయ్యే అనుభవాలే స్టోరీలైన్. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, వన్ లైన్ పంచ్‌లతో మరోసారి అలరించారు. హీరోయిన్ మీనాక్షి నటన, అందంతో ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత స్టోరీ లైన్, యావరేజ్ మ్యూజిక్ మైనస్. సెకండాఫ్‌లో వచ్చే పొలిటికల్ డ్రామా ల్యాగ్ అన్పిస్తుంది. ఓవరాల్‌గా కామెడీ ట్రావెల్.
రేటింగ్: 2.75/5.

News January 14, 2026

CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>CSIR-<<>>సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CEERI)లో 7ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్), BE/BTech, ME/MTech, సంబంధిత డిగ్రీ, టెన్త్+డిప్లొమా (MLT/DMLT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.ceeri.res.in

News January 14, 2026

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్, ఎస్పీ శుభాకాంక్షలు

image

మకర సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లాలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.