News January 2, 2026
నేషనల్స్‌కు నర్సీపట్నం సీనియర్ మహిళా బాక్సర్లు

నర్సీపట్నం బాక్సింగ్ అకాడమీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉమెన్ బాక్సర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్ నోయిడాలో జరిగే 9వ సీనియర్ మెన్, ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బొంతు మౌనిక(75 కేజీలు), యర్రా తేజస్విని (80+ కేజీలు) పాల్గొంటారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి అర్హత పొందారు.
Similar News
News January 8, 2026
పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: దీపక్ తివారి

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. విద్యార్థుల హాజరు 100% ఉండేలా ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలు చాలా కీలకమైనవని, సబ్జెక్టుల్లో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News January 8, 2026
విద్యార్థుల వివరాలు అందజేయాలి: డీఈవో

సర్వేపల్లి రాధా కృష్ణ విద్యా కిట్స్ అందజేసేందుకు విద్యార్థుల వివరాలు అందజేయాలని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు గురువారం తెలిపారు. పోలవరం జిల్లాలో 898 పాఠశాలల్లో 52,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల HMలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీ విద్యార్థికి సరిపడే బూట్లు ఇచ్చేందుకు పాదం కొలతలు నమోదు చేయాలన్నారు. ఈ నెల 20లోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
News January 8, 2026
HYDలో నేను ఎక్కడ నడవాలి? చెప్పండి ప్లీజ్!

‘నాకు కారులేదు. బండి లేదు. సైకిల్ కూడా లేదు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లాలి. మరి ఎలా వెళ్లాలి? మహానగరంలో ఎక్కడ చూసినా రోడ్లే. నేను నడవాలంటే రోడ్లపై నడవాల్సిందేనా? సిటీలో దాదాపు 10వేల KM రోడ్లు ఉంటే నడవడానికి 550 KM ఫుట్‌పాత్ ఉంది. ఇదేం పద్ధతి? ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వ్యాపారులు, సామగ్రి, పాన్ డబ్బాలు ఆక్రమించాయి? నేను నడిచేందుకు దారి చూపించండి సార్.. అంటూ ఓ నగరవాసి చేసిన విన్నపం ఇది.


