News April 24, 2024
డ్యుయల్ సిటిజన్షిప్పే ఎందుకంటే? – 3/3

ఇందుకు ఊరటగా సరెండర్ సర్టిఫికెట్ స్థానంలో రివొకేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఈనెల 4న కేంద్రం కొత్త మెమోరాండం తీసుకొచ్చింది. కానీ దీనిపై సంతృప్తి చెందని కొందరు, డ్యుయల్ సిటిజన్షిప్పే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటున్నారు. OCI ఉన్నా సాగు భూముల కొనుగోలుకు, ఓటు వేసేందుకు హక్కు లేకపోవడం సహా విదేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 16, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.
News November 16, 2025
వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
News November 16, 2025
మత సామరస్యానికి ప్రతీక వావరు స్వామి గుడి

వావరు స్వామి అయ్యప్పకు అత్యంత ప్రీతిపాత్రుడైన ముస్లిం భక్తుడు. శబరిమల యాత్రలో, ఎరుమేలిలో ఉన్న వావరు స్వామి ఆలయం మత సామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప కేంద్రంగా ఉంది. అయ్యప్ప భక్తులు మొదటగా ఆయనను దర్శించుకోవడం, పక్కనే ఉన్న పేటతుళసి ఆలయంతో ఈ ఆలయం ఉండటం.. హైందవ, ముస్లిం ఐక్యతకు ప్రతీక. వావరు స్వామి ఆలయ దర్శనం, దైవం ముందు అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. <<-se>>#AyyappaMala<<>>


