News January 2, 2026

రూ.70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు!

image

మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.70 కోట్లతో తెరకెక్కగా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. VFX క్వాలిటీగా లేదని ఫస్ట్ డే నుంచే నెగటివ్ టాక్ రావడం సినిమా పాలిట శాపమైంది. బడ్జెట్‌లో కనీసం 10% కూడా రికవరీ అయ్యే అవకాశం లేదని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 2025లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.

Similar News

News February 16, 2026

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

image

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.

News February 16, 2026

సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>సెంటర్<<>> సిల్క్ బోర్డ్‌ 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(FEB 18). BTech/BE(టెక్స్‌టైల్ ఇంజినీరింగ్& ఫైబర్ సైన్స్) అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. GATE-2025 స్కోరు, ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,000-1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://csb.gov.in/

News February 16, 2026

‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

image

AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు రూ.2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఇందులో గేట్స్ ఫాండేషన్‌తో TCS భాగస్వాములు.