News January 2, 2026
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

ప్రస్తుత దాళ్వా సీజన్‌లో జిల్లాలో యూరియాతో సహా ఎలాంటి ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు మొత్తం 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 4,686 టన్నులు సరఫరా చేశామన్నారు. శుక్ర, శనివారాల్లో రైల్వే రేక్ ల ద్వారా మరిన్ని నిల్వలు వస్తున్నాయని వెల్లడించారు. ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
Similar News
News January 12, 2026
కాకినాడ: రైలు కింద నుంచి రాబోయి.. మరో రైలుకు బలై!

రైల్వే పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన మన్యం సూర్యరావు(85) బహిర్భూమికి వెళ్లి వస్తూ, స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి దూరి పట్టాలు దాట సాగాడు. ఆ సమయంలో పక్క ట్రాక్‌పై వేగంగా వచ్చిన మరో రైలు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 12, 2026
ఖమ్మం: రిజిస్ట్రేషన్ల శాఖకు ‘కాసుల పంట’

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.25 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఏడాది (2025-26) డిసెంబరు నాటికే రూ. 141.84 కోట్లు లభించాయి. మరో మూడు నెలల సమయం ఉండటంతో ఈసారి ఆదాయం రికార్డు స్థాయికి చేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (<


