News January 2, 2026

టోల్ ప్లాజాల వద్ద ‘ఫ్రీ’ రూట్ కావాలి.. ఎంపీ సానా సతీష్ ట్వీట్

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జాతీయ రహదారిపై 4రోజుల పాటు టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎక్స్(ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు ‘ఫ్రీ’ విధానం అమలు చేయాలని సూచించారు.

Similar News

News February 18, 2026

AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

image

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

News February 18, 2026

పార్వతీపురం: వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్

image

శాసన మండలిలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. బుధవారం ఆమె అమరావతిలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం అన్నారు. అసెంబ్లీకి రారని, శాసన మండలికి వచ్చిన వారు సభను నడవానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కను పెట్టీ బిల్ గేట్స్, టీ గురించి చర్చించాలని పట్టుబడటపై మండిపడ్డారు.

News February 18, 2026

కోరంగిలో పర్యాటకులకు తప్పిన ప్రమాదం

image

తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును పంపి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిత్యం బోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.