News January 2, 2026
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎస్‌ఎఫ్, కేజడ్ఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కమిషనర్లు, నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
Similar News
News January 17, 2026
మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు

AP: సంక్రాంతి పండుగను కుటుంబంతో ఆనందంగా గడిపిన ప్రజలు మధుర జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని పల్లెలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం తిరిగి నగరాల బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా RTC ప్రత్యేక బస్సులు, SCR ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
News January 17, 2026
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

BRS ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేసి క్రెడిట్ కొట్టేయడమే కాంగ్రెస్ పాలనగా మారిందని హరీశ్ రావు ఆగ్రహించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ నిర్మించిందేమీ లేదని, కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నియామక పత్రాలే రేవంత్ రెడ్డికి రెడీమేడ్‌గా దొరికాయని విమర్శించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చి ప్రజల మనోభావాలు అవమానిస్తున్నారని, భూసేకరణ, కాలువల పనులు చేయక రైతులను మోసం చేస్తున్నారన్నారు.
News January 16, 2026
జనగామ: గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరు

జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌కు చెందిన గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు.


