News January 2, 2026
ఆ ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదు: ఎల్.రమణ

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని ఎమ్మెల్సీ L.రమణ పేర్కొన్నారు. మండలిలో మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి KCR ప్రభుత్వం రూ.100 కోట్లతో జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేసిందని విమర్శించారు. కొండగట్టు పరిధిలో చేర్చిన భూములపై ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదని పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.
News January 13, 2026
మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.
News January 13, 2026
NTR: యువతి ఆధార్ చోరీ చేసి లోన్.. ఆపై టోకరా..!

గుణదలకు చెందిన సాయి కిరణ్ అనే వ్యక్తి తన ఆధార్ కార్డుని తనకు తెలియకుండానే తీసుకుని లోన్ యాప్‌లో రూ.1లక్ష తీసుకున్నాడని యువతి ఆరోపించారు. తిరిగి చెల్లించక పోవడంతో కో అప్లికేంట్ కింద తనను యాడ్ చేయడంతో లోన్ యాప్ వాళ్లు వేధిస్తున్నట్లు తెలిపారు. బాధిత యువతి మాచవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. తన ఆధార్, సంతకం ఫోర్జరీ చేశారని బాధితురాలు వాపోయారు.


