News January 2, 2026

జిల్లా అభివృద్ధికి సమన్వయంతో ముందుకు: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు నడవాలని కలెక్టర్ దివాకర అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితుడైన బైరెడ్డి భగవాన్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పని చేస్తామని, అధికారులు సహకారం అందించాలని భగవాన్ రెడ్డి కోరారు.

Similar News

News January 5, 2026

ఇరుసుమండ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా!

image

ఇరుసుమండలో సంభవించిన గ్యాస్ లీకేజీ, <<18769737>>మంటల <<>>ఉద్ధృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, మోరి-5 బావి వద్ద మంటలను అదుపు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ ప్రమాదంపై సమగ్ర నివేదికను తనకు త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News January 5, 2026

WGL: కొండాపురంలో రైతు హత్య?

image

రాయపర్తి మండలం కొండాపురంలో రైతు కొండ వీరస్వామి (60) తన వ్యవసాయ క్షేత్రం వద్ద అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో పడి ఉన్న వీరస్వామి మృతదేహాన్ని గొర్రెలు కాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

News January 5, 2026

2025లో శ్రీసిటీకి రూ.20,250 కోట్ల పెట్టుబడి: సతీశ్

image

YCP హయాంలో నిర్లక్ష్యానికి గురైన శ్రీసిటీకి ఇప్పుడు పునర్వైభవం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు సాన సతీశ్ బాబు అన్నారు. 2025లో శ్రీ సిటీకి 43 MOUల ద్వారా రూ.20,250 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. CM చంద్రబాబు దూరదృష్టి, మంత్రి లోకేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఆయన ‘X’లో ట్వీట్ చేశారు.