News January 2, 2026
మేడారం జాతరపై వైద్యాధికారుల సమీక్ష

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు సమావేశమయ్యారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైద్యశాలలోని స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో డిప్యూట్ చేసుకోవాలన్నారు.
Similar News
News January 6, 2026
సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో 2 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) తెలిపింది. 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ట్రైన్ బయల్దేరనుంది. 19న మధ్యాహ్నం 3.30కు చర్లపల్లి నుంచి విశాఖకు రైలు స్టార్ట్ అవుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. రేపు ఉదయం నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
News January 6, 2026
తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీ నిలిపివేత

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్ జారీని 9వ తేదీ నుంచి TTD నిలిపి వేయనుంది. రోజువారీ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో 800 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఒక కుటుంబానికి 1+3(మొత్తం 4 మంది) వరకే అనుమతి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయంలో యథావిధిగా 200 టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇస్తారు.
News January 6, 2026
రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

AP: <


