News January 2, 2026

అరకు: ఆస్పత్రి బాత్రూంలో మహిళ డెలివరీ

image

అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రుంలో శుక్రవారం గుర్తు తెలియని శిశువు మృతదేహం ఉండటం కలకలం రేగింది. బాత్రూంలో గురువారం రాత్రి గుర్తుతెలియని మహిళ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చి, అనంతరం ఎవరికి తెలియకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది శుక్రవారం ఉదయం బాత్రూంలో నవజాత శిశువు ఉన్నట్లు గుర్తించారు. CC ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 19, 2026

T20WC.. శ్రీలంకపై జింబాబ్వే సంచలన విజయం

image

T20WCలో మరో సంచలనం నమోదైంది. ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే ఇవాళ శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత లంక 20 ఓవర్లలో 178/7 రన్స్ చేసింది. అనంతరం జింబాబ్వే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ బెన్నెట్ (63*), సికిందర్ రజా 45 పరుగులతో తమ జట్టును గెలిపించారు. ఇప్పటికే జింబాబ్వే సూపర్-8లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

News February 19, 2026

‘రఫేల్’ భారత్‌ను బలోపేతం చేస్తుంది: మాక్రాన్

image

ఫ్రాన్స్‌తో భారత్ 114 రఫేల్ విమానాల డీల్ ప్రతిపాదనను ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ సమర్థించారు. ఈ డీల్‌పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ డీల్ భారత్‌ను బలోపేతం చేస్తుందని, భారత్-ఫ్రాన్స్ బంధం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇక రఫేల్ యుద్ధవిమానాల లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై సానుకూలంగా స్పందించారు. సబ్‌మెరైన్ల ప్రాజెక్ట్‌పైనా ఇరు దేశాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.

News February 19, 2026

ఏలూరు: ‘అధికారుల తీరుపై ఉపేక్షించే ప్రసక్తే లేదు’

image

జిల్లా అధికారులు నిర్లక్ష్యంతో లక్ష్యాలను పూర్తి చేయకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ వెట్రీ సెల్వీ తేల్చి చెప్పారు. పంచాయతీరాజ్, జే రామ్ జీ, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్ తదితర నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..అంబెడ్కర్ గురుకులాలకు మంజూరైన 49 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లకు 16 పనులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.