News January 2, 2026
ఇబ్రహీంపట్నం: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్..

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, రాములులను సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించనున్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో వీరిని సిట్ విచారించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని ఈ కేసులో పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరికి ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పించింది.
Similar News
News February 22, 2026
అన్నమయ్య: ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP ధీరజ్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 22, 2026
చిత్తూరు: పులిగుండు కొండపైన సినిమా షూటింగ్

టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. షూటింగ్ వద్ద స్థానిక ప్రజలు చూసేందుకు ఎగబడ్డారు.
News February 22, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


