News January 2, 2026
పార్క్‌లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్‌లను నాటండి: బల్దియా కమిషనర్

పార్క్ లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్లను నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం HNK పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్క్, జయశంకర్ ఏకశిలా పార్క్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. శీతాకాల సీజన్‌లో పుష్పించే పూల మొక్కలను నాటడం వల్ల పార్క్‌ల ఆవరణలు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. సీహెచ్‌ఓ రమేష్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవళిక ఉన్నారు.
Similar News
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 11, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.
News January 11, 2026
డిప్యూటీ సీఎంకు హరీష్ రావు లేఖ

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 9 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు కనికరం చూపలేదని ఈ సంక్రాంతికైనా స్పందించాలని కోరారు.


