News January 2, 2026
నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.
Similar News
News January 14, 2026
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.
News January 14, 2026
ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.
News January 14, 2026
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.


