News April 24, 2024
రాష్ట్రంలో రూ.155 కోట్లు స్వాధీనం

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ.61.77 కోట్ల నగదు, రూ.19.16 కోట్లు విలువ చేసే నగలు, రూ.28.92 కోట్ల విలువైన మద్యంతో పాటు రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
ఉద్యోగుల కోసం రూ.713 కోట్లు విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్లు విడుదల చేస్తూ Dy.CM బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ.700 కోట్లు చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు, ఆగస్టు నుంచి ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది.
News December 31, 2025
ఇన్సెంటివ్స్ పెంచిన స్విగ్గీ, జొమాటో

డెలివరీ పార్ట్‌నర్స్ స్ట్రైక్‌తో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు జొమాటో, స్విగ్గీ పార్ట్‌నర్స్‌కు మెసేజెస్ పంపాయి. డెలివరీకి ₹120-150తో ఇవాళ ₹3000 వరకు సంపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఉండవు. స్విగ్గీ అయితే నేడు, రేపు ₹10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.
News December 31, 2025
Money Tip: మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్ అవుతుందో తెలుసా?

మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి ‘72’ ఒక మ్యాజిక్ నంబర్. ఉదాహరణకు మీకు 8% వడ్డీ వస్తుంటే.. 72ను 8తో భాగిస్తే వచ్చే 9 ఏళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 6 ఏళ్లలోనే మీ పెట్టుబడి డబుల్ అవ్వాలనుకుంటే మీకు 12% వడ్డీ ఇచ్చే స్కీమ్ ఎంచుకోవాలని ఇది చెబుతుంది. ద్రవ్యోల్బణం మీ డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో కూడా ఈ సింపుల్ ట్రిక్ ద్వారా చిటికెలో లెక్కించవచ్చు.


