News January 2, 2026

‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

News January 13, 2026

కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

image

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2026

కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.