News April 24, 2024
కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ: KCR

TG: ‘కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. దీనిని ఎవ్వరూ తుడిచివేయలేరని చెప్పారు. తనను తగ్గించే ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీవి వికృత రాజకీయ క్రీడలని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని దుయ్యబట్టారు. దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు.
Similar News
News March 31, 2026
పరారీలో ఖైదీ.. గ్యాస్ బుక్ చేసి దొరికిపోయాడు!

కర్ణాటకలో భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందీప్ తోమర్ అనే మాజీ జవాన్ చివరకు గ్యాస్ బుకింగ్ వల్ల దొరికిపోయాడు. 2014లో జీవిత ఖైదు పడిన ఇతను.. బెయిల్‌పై వచ్చి 2022 నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి పాన్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో పోలీసులు అతడిని ట్రాక్ చేశారు. MPలోని పాండుర్నాలో మాటువేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
News March 31, 2026
ట్రంప్‌కు షాకిచ్చిన ఇటలీ!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇటలీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనే US విమానాలకు ఇటలీ ఎయిర్‌స్పేస్‌ను మూసేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అలాగే సిసిలీలో ఉన్న తమ వైమానిక స్థావరాన్ని వాడుకోవడానికీ అనుమతి నిరాకరించినట్లు తెలిపింది. యూఎస్ బాంబర్ విమానాలను నిలపడానికి అమెరికా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల స్పెయిన్ సైతం <<19516561>>ఇలాంటి ప్రకటనే<<>> చేసిన విషయం తెలిసిందే.
News March 31, 2026
GTvsPBKS.. టాస్ గెలిచిన పంజాబ్

IPL: చండీగఢ్ వేదికగా కాసేపట్లో GTతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన PBKS కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ఎంచుకున్నారు.
PBKS: ప్రభ్‌సిమ్రాన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, షారుఖ్, తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, అశోక్ శర్మ, సిరాజ్


