News January 2, 2026
కాకినాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

గండేపల్లి మండలం తాళ్లూరు దాబా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పలపాడుకు చెందిన బండారు దుర్గాప్రసాద్ (38) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. దుర్గాప్రసాద్ తన ద్విచక్ర వాహనంపై జగ్గంపేట వైపు వెళ్తుండగా, మరో బైక్ ఢీకొట్టడంతో కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన పాఠశాల బస్సు ఆయనపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 12, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News January 12, 2026
సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.
News January 12, 2026
NGKL: సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంపీ

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ డా. మల్లు రవి అధికారులకు సూచించారు. గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 251 ఫిర్యాదులకు గానూ 176 కేసుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయని కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం బాధితులకు తక్షణ పరిహారం అందజేయాలని ఎంపీ ఆదేశించారు.


