News January 2, 2026

ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచారం..?

image

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు రోజుల కింద హన్మాజీపేట శివారులోని రైస్ మిల్ వద్ద చిరుతపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి, చిరుత సంచారం నిజమేనని నిర్ధారించారు. ఈ క్రమంలో ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచరించడం గమనించినట్లు ప్రచారం జరగడంతో గ్రామస్థులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Similar News

News January 20, 2026

అల్లూరి: తరాలు మారినా.. మారని గిరిజనుల తలరాతలు

image

తరాలు మారుతున్నా ఆదివాసీల తలరాతలు మారటం లేదు. కాలం ఏదైనా గిరిజనులకు డోలీ మోతలు తప్పటం లేదు. సోమవారం పెదబయలు మండలంలోని బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామంలో అనారోగ్యానికి గురైనా పోయిబ రాములమ్మను డోలీలో ఆస్పత్రికి తరలించిన దృశ్యం గిరిజనుల అవస్థలకు అద్దం పడుతోంది. గ్రామంలో సెంగెరెడ్డ వీధికు సరైనా రోడ్డు సదుపాయం లేకపోవడంతో డోలీ ద్వారా రాములమ్మను ఆస్పత్రికి తరలించారు.

News January 20, 2026

అమ్రాబాద్‌లో 11.8 డిగ్రీలు.. గజగజ వణుకుతున్న జిల్లా

image

నాగర్‌కర్నూలు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో అమ్రాబాద్‌లో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి, బల్మూరుల్లో 12.3, అచ్చంపేట, తెలకపల్లిలో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్యం ప్రాంత ప్రజలు చలితో గజగజ వణుకుతున్నారు.

News January 20, 2026

కొత్తగూడెం విమానాశ్రయం ‘దుమ్ముగూడెం’కు షిఫ్ట్!

image

కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన విమానాశ్రయం వేదిక మారింది. గతంలో సుజాతనగర్ మండలం గరీబుపేటలో స్థల పరిశీలన చేయగా, సాంకేతిక కారణాల వల్ల ప్రతికూల నివేదిక వచ్చింది. దీంతో తాజాగా దుమ్ముగూడెంలో అనువైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరుతుందని భావిస్తున్నారు.