News January 2, 2026
VKB: ‘రోడ్డు భద్రతా నియమాలు పాటించండి’

నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలని వికారాబాద్ జిల్లా రోడ్డు రవాణా సంస్థ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రవాణా మాసోత్సవాల్లో భాగంగా ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలన్నారు.
Similar News
News January 10, 2026
రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ ₹3వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.
News January 10, 2026
కృష్ణా: కోళ్లు కాదు.. కోట్లు చేతులు మారబోతున్నాయి..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి జూదం పరాకాష్టకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా బరులు సిద్ధం కాగా, పందేల రూపంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారనుంది. పది పందేలు గెలిస్తే కార్లు, బుల్లెట్ బైకులు బహుమతులుగా ప్రకటిస్తూ పందెగాళ్లను ఆకర్షిస్తున్నారు. సరదా పేరుతో మొదలయ్యే ఈ వ్యసనం వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 10, 2026
మంత్రి అనిత- సీనియర్ల మధ్య గ్యాప్?

అనకాపల్లి జిల్లాలో సీనియర్ MLAలు, మాజీ మంత్రులతో హోంమంత్రి అనిత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆమె కార్యక్రమాల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పరమైన పిలుపులు తప్ప ఆత్మీయ ఆహ్వానాలు లేవని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఈ అసంతృప్తికి నిదర్శనమంటున్నారు.


