News January 2, 2026

మెదక్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

image

మెదక్ జిల్లా శివంపేట(M) తిమ్మాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్త స్వామిని హత్య చేసిన భార్య మౌనిక, ప్రియుడు సంపత్‌లను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వివాహేతర సంబంధంపై భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. అడ్డు తొలగించుకోవడానికి గత నెల 22న స్వామికి మద్యం తాగించి నిద్రలో ఉండగా భార్య మౌనిక, ప్రియుడు సంపత్ కలిసి హత్య చేసినట్లు వివరించారు. ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేశామన్నారు.

Similar News

News January 4, 2026

2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో BRS అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నాటి CM KCR, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావే అంతా చేశారని ధ్వజమెత్తారు. అయితే నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.

News January 4, 2026

సంగారెడ్డి: పది నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. హాల్ టికెట్లు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు సెయింట్ ఆంతోని (శాంతినగర్), సెయింట్ ఆంథోని (విద్యానగర్), సెయింట్ ఆర్నాల్డ్, కరుణ పాఠశాలలో పరీక్ష జరుగుతాయని పేర్కొన్నారు.

News January 4, 2026

నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

image

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.