News April 24, 2024
ఖానాపురం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలో జాతీయ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుంచి బుధరావుపేటకి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న సులేమాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు మహిళలకి గాయాలు అయ్యాయి. కారు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Similar News
News July 8, 2025
వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.
News July 8, 2025
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్‌కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
News July 7, 2025
వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.