News January 3, 2026

గోదావరి నదిలో మహిళ గల్లంతు

image

కొవ్వూరు వంతెనపై శుక్రవారం సాయంత్రం ఇద్దరు మహిళలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆటోలో ఇద్దరు మహిళలు చిన్నపిల్లతో వంతెనపై దిగారు. వీరిలో ఒక మహిళ గోదావరిలో దూకి గల్లంతయ్యారు. మరో మహిళను, చిన్నారిని వాహనదారులు అడ్డుకున్నారు. నదిలో గల్లంతయిన మహిళ దేవరపల్లి మండలం దుద్దుకూరు వాసి ఈగల ధనలక్ష్మి(40)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2026

రేపు ‘డయల్‌ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు.

News February 8, 2026

రేపు PGRS రద్దు.. కారణం ఏంటంటే?

image

ఫిబ్రవరి 9న CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు-కార్యదర్శుల సదస్సు ఉన్నందున, ఆరోజు జరగాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టర్లు, SPలు ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి సోమవారం నుంచి ఈ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

News February 7, 2026

పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి: మంత్రి దుర్గేశ్

image

గోదావరి మహా పుష్కరాలు-2027 రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.