News January 3, 2026

జగిత్యాల: ‘నాణ్యమైన విద్య బోధనకు కృషి చేయాలి’

image

నాణ్యమైన విద్య బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా విద్యాధికారి రాముతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. మచ్చ శంకర్, బైరం హరికిరణ్ పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

సూర్యాపేట: ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్రమంతా ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరి రెండో వారంలో ఉండవచ్చని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నేరేడుచర్లలో ఉన్న 15 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకొని సగర్వంగా నిలవాలని నాయకులకు సూచించారు.

News January 20, 2026

ఏలూరు జిల్లాలోని 1,4500 హెక్టార్లలో కోకో క్లస్టర్స్

image

ఏలూరు జిల్లాలో 8,833 మంది రైతులకు ఉపయోగపడేలా 1,4500 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న కోకో క్లస్టర్ ఏర్పాట్లను నేషనల్ హార్టికల్చర్ బోర్డు టీం మంగళవారం పరిశీలించిందని అధికారులు తెలిపారు. అధికారుల వివరాల మేరకు.. జిల్లా క్లస్టర్ డెవెలప్మెంట్ ప్రోగ్రాం కింద నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా రూ. 157.82 కోట్ల రూపాయలతో నవభారత్ లిమిటెడ్ కోకో క్లస్టర్ ఏర్పాటు చేస్తుందన్నారు.

News January 20, 2026

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలి- కలెక్టర్

image

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించి ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ క్లినిక్‌లు, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి నూటికి నూరు శాతం పరిష్కారం చూపాలన్నారు.