News January 3, 2026
జగిత్యాల: ‘వసతి గృహాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల వసతి గృహ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం-2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.
Similar News
News January 3, 2026
పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 62, టైప్-4 కేజీబీవీల్లో 38 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
నల్గొండ: 10 నెలలు.. 1,47,184 రేషన్ కార్డులు

ఉమ్మడి నల్గొండలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 10 నెలల్లోనే ప్రభుత్వం కొత్తగా 1.47 లక్షల మందికి పైగా కార్డులను మంజూరు చేసింది. గత జనవరిలో 10.06 లక్షలుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులని తేలితే చాలు, అధికారులు వెంటనే కార్డులను ఓకే చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 22 వరకు 1,47,184 కార్డులు జారీ అవ్వడం గమనార్హం.
News January 3, 2026
విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <


