News April 24, 2024

పదేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా పాలించాం: కేసీఆర్

image

TG: తాను ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకమని చాలా మంది అనుకున్నారని, కానీ తానెప్పుడూ అలా వ్యవహరించలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మనుషుల మధ్య గోడలు కట్టడం తెలివైన పని కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన హయాంలో ఏ ప్రాంతం వారైనా బాధపడే పరిస్థితి తాను తీసుకురానివ్వలేదని తెలిపారు. పదేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్రాన్ని పాలించామన్నారు.

Similar News

News November 20, 2024

టైమ్స్ నౌ JVC ఎగ్జిట్ పోల్స్: ఝార్ఖండ్‌లో హోరాహోరీ

image

ఝార్ఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్టు టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 40-45 సీట్లు, ఇండియా కూటమికి 30-40 సీట్లు రావొచ్చని తెలిపింది. ఇతరులు ఒక సీటు గెలవొచ్చని పేర్కొంది.

News November 20, 2024

జన్‌మత్ పోల్స్: రెండు రాష్ట్రాల్లో హంగ్

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ‘హంగ్’ పరిస్థితి రావొచ్చని జన్‌మత్ పోల్స్ అంచనా వేసింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 130-145, MVA 125-140 సీట్లు గెలవొచ్చని తెలిపింది. పార్టీల పరంగా బీజేపీ 77-82, SS 38-42, NCP 12-15, కాంగ్రెస్ 48-52, SSUBT 37-41, NCP(SP) 38-42, ఇతరులు 15-17 సీట్లు గెలుస్తాయంది. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 41-45, ఇండియా 36-39, ఇతరులు 3-4 సీట్లు గెలవొచ్చని పేర్కొంది.

News November 20, 2024

ఝార్ఖండ్‌లో BJPదే అధికారం: చాణక్య స్ట్రాటజీస్

image

ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూట‌మి ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని చాణక్య స్ట్రాటజీస్ స‌ర్వే అంచ‌నా వేసింది. మొత్తం 81 స్థానాల్లో బీజేపీ కూట‌మి 45-50 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని వెల్ల‌డించింది. ఇక అధికార జేఎంఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూట‌మి 35-38 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తెలిపింది.