News April 24, 2024
ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈదా నామినేషన్
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నియోజవర్గ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
Similar News
News February 5, 2025
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
News February 5, 2025
ప్రకాశం: వరల్డ్ కప్ విజేతకు ఘన స్వాగతం
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.