News January 3, 2026
వికారాబాద్‌లో వనమూలికల ఉన్నాయని తెలుసా?

వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కలు విరివిగా ఉండటంతో అక్కడి వాతావరణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మేవారు. ఈ చెట్ల వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, ఊపిరితిత్తులు బలపడతాయని భావించి 1920 ప్రాంతంలో టీబీ రోగులు వికారాబాద్ అడవులకు వెళ్లి కొంతకాలం నివసిస్తూ ఆరోగ్యం మెరుగుపడుతుందని అక్కడే నివసించేవారట. మీరూ దీని గురించి విన్నారా?
Similar News
News February 10, 2026
కల్వకుర్తి: పురపోరు.. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఓ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటుకు పదివేలతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరో వార్డులో ఓటుకు రూ.5 వేలతో పాటు వెండి ఉంగరం అందజేసి ఎన్నికలలో గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
News February 10, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in
News February 10, 2026
HYD: కొత్త కమిషనరేట్లు.. వీరే బాధ్యులు..!

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.


