News January 3, 2026
హైదరాబాద్‌లో అంతా ఆన్‌లైన్‌లోనే!

GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగాలని GHMC స్పష్టం చేసింది. నగదు లావాదేవీలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు ప్రకటించింది. UPI, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపులు స్వీకరిస్తామని తెలిపింది. కొత్త విధానానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇకపై ఒకే పన్ను వసూలు విధానం అమల్లోకి వచ్చింది.
Similar News
News January 6, 2026
HYD: కొత్తగా వర్క్ ఫ్రమ్ విలేజ్!

గజ్వేల్, చౌటుప్పల్ వంటి పల్లెలు ఇకపై వ్యవసాయానికే పరిమితం కావు. గ్రిడ్ పాలసీ పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో 10Gbps ఇంటర్నెట్, సోలార్ పవర్ హబ్‌ను ప్రతిష్ఠిస్తోంది. T-Fiber నెట్‌వర్క్‌ను విద్యుత్ పోల్స్ ద్వారా ప్రతి ఇంటికీ అనుసంధానించడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. IT కోసం హైటెక్స్ వెళ్లకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసేలా ‘వర్క్ ఫ్రమ్ విలేజ్’ ప్లాన్ ఇది.
News January 6, 2026
HYD: జనవరి 8, 9న నీటి సరఫరా బంద్!

HYDలో పలు చోట్ల నీటి సరఫరా బంద్ కానుంది. JAN 8న ఉదయం 10 గంటల నుంచి JAN 9న తెల్లవారుజామున 4 గంటల వరకు సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ కారణంగా మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఫతేనగర్, బాలానగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో 18 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSSB తెలిపింది.
News January 6, 2026
FLASH: హైదరాబాద్ ఘన విజయం

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.


