News January 3, 2026
ట్యాన్‌ను తగ్గించే ఫేస్ ప్యాక్

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక టేబుల్‌స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ కాఫీ, నిమ్మరసం, రెండు టీస్పూన్ల పెరుగు వేసి, బాగా కలపాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. ట్యాన్ తగ్గిపోతుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. శనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి.
Similar News
News February 10, 2026
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ శర్మ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు.
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై స్పందించిన నరవణె

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంపై వివాదం చెలరేగిన వేళ మాజీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె స్పందించారు. పుస్తకం పబ్లిషింగ్, డిజిటల్ ఫామ్, ప్రింట్ పూర్తి కాలేదని వెల్లడించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోస్ట్‌కు ట్యాగ్ చేశారు.
News February 10, 2026
భారీ టార్గెట్‌ను ఊదేశారు

T20WC: UAEపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టిమ్(89), ఫిన్ అలెన్(84) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు. యూఏఈ బౌలర్లు ఎవరూ కివీస్ బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. రొహిద్ ఖాన్, జునైద్‌లు 40+ పరుగులు సమర్పించుకున్నారు.


