News January 3, 2026
సిరిసిల్ల: 76 మంది చుక్కేసి.. చిక్కారు..!

నూతన సంవత్సర సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. అన్ని పోలీసుల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. 76 మంది మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసులు నమోదు చేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్టేషన్‌కు తరలించారని వెల్లడించారు.
Similar News
News February 16, 2026
ఎరువుల కొరత లేదు.. రైతులకు జేడీ భరోసా

కాకినాడ జిల్లాలో యూరియా సహా ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు 32,613 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 28,892 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, మరో 5,710 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎవరైనా ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
News February 16, 2026
పార్వతీపురం: కలెక్టరేట్ పీజీఆర్ఎస్‌కి 73 అర్జీలు

పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 73 వినతులు వచ్చాయి. ఈ మేరకు సబ్ కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తి పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 25 ఉండగా ఇతర సమస్యలుపై 48 అర్జీలు వచ్చాయన్నారు. డిఆర్డిఏ పీడీ సుధారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 16, 2026
పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.


