News January 3, 2026
అల్లూరి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్.రామయ్య (38) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ రమేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ చెప్పిన వివరాల మేరకు.. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న రామయ్య ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
నల్గొండ: రెండు రెట్లు పెరిగిన వాహనాల రద్దీ

సంక్రాంతి వేళ 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల కంటే రెండు రెట్లు అధికంగా వాహనాలు వస్తుండటంతో చౌటుప్పల్, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, టోల్ నిర్వాహకులు అదనపు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణ సమయం పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు.
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
సిరిసిల్ల: ప్రజావాణికి 122 దరఖాస్తుల స్వీకరణ

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి 122 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


