News January 3, 2026

KMM: కానిస్టేబుల్ ఇంట్లోనే 37 తులాల బంగారం చోరీ

image

రఘునాథపాలెం మండలం కోయచలకలో మహిళా కానిస్టేబుల్ పూజిత ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. దంపతులు విధులకు వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 37.7 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్థుల పనేనని అనుమానిస్తున్నారు. పోలీస్ ఇంట్లోనే దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News February 17, 2026

KCR బర్త్‌డే.. సాదాసీదాగా కవిత విషెస్

image

TG: మాజీ సీఎం, తన తండ్రి KCR పుట్టినరోజు సందర్భంగా కవిత ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఆమె సాదాసీదాగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పైనా ఆమె విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా KCRకు విషెస్ తెలిపారు.

News February 17, 2026

కాగజ్‌నగర్‌లో SP అఖిల్ తనిఖీలు

image

కాగజ్‌నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.

News February 17, 2026

నా కూతురిని రేప్ చేసి చంపేశారు: ప్రత్యూష తల్లి

image

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు <<19164468>>తీర్పును<<>> గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజిని పేర్కొన్నారు. కానీ తనకు న్యాయం జరగలేదన్నారు. ‘నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారు. నిందితుడికి జీవిత ఖైదు వేయాలని పోరాటం చేశా. కేసు మొదట్లోనే సాక్ష్యాలను తారుమారు చేశారు. ప్రత్యూష శరీరంపై గాట్లు ఉన్నాయి. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిందని మునుస్వామి ఇచ్చిన రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు?’ అని ప్రశ్నించారు.