News January 3, 2026
BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్‌ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 25, 2026
ఇండియా ఓడినందుకు రవిశాస్త్రి హ్యాపీ.. ఎందుకంటే?

T20 WC: సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోవడంపై రవిశాస్త్రి స్పందించారు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురుకావడం సహజమని, ఇది టీమ్‌కు మేల్కొలుపు లాంటిదని అభిప్రాయపడ్డారు. సెమీఫైనల్స్ వంటి కీలక దశలో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఓటమి వల్ల జట్టు తన వ్యూహాలను, ప్లేయింగ్ ఎలెవన్‌ను రివ్యూ చేసుకొని పుంజుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
News February 25, 2026
24 గంటలూ స్పీడ్ పోస్ట్ బుకింగ్

AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.
News February 25, 2026
ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.


