News January 3, 2026
మురుగు నగరానిది.. కన్నీరు నల్గొండది..!

హైదరాబాద్ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం చివరగా నల్గొండ జిల్లాకు చేరుతుండటంతో అక్కడ పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని, నల్గొండ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తానన్న ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్.
Similar News
News January 13, 2026
MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News January 13, 2026
పాలమూరు: ఎస్సీ, స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

MBNR జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు మరియు స్టైఫండ్ అందజేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 13, 2026
నంద్యాల: నడివీధిలో చెప్పుతో కొట్టాడు.. న్యాయం చేయండి సార్..!

శిరివెళ్ల మండలం వణికందిన్నెకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ నంద్యాల జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తనను మహిళ అని కూడా చూడకుండా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడివీధిలో చెప్పుతో కొట్టి అవమానపరిచాడని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వ్యక్తి నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు.


