News January 3, 2026

నిజామాబాద్: నే’తల’కు నొప్పి తప్పదా..?

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఈసారి భారీగా పెరగనుంది. అధికార కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్‌ల నుంచి కూడా ఒక్కరి కన్నా ఎక్కువ మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులకు టికెట్ల కేటాయింపు తలనొప్పి కానుందనే చర్చ జరుగుతోంది.

Similar News

News January 14, 2026

మెదక్: అంబరాన్నంటిన భోగి సంబరాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భోగి సంబరాలు అంబరాన్నంటాయి. సంగారెడ్డి, సద్దిపేట, మెదక్ జిల్లాల్లోని ఆయా ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వేసి సంప్రదాయబద్ధంగా పండుగను ప్రారంభించారు. మంటల చుట్టూ రంగురంగుల ముగ్గులు, దీపాలతో అలంకరించి పండుగ శోభను పెంచారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించుకున్నారు.

News January 14, 2026

TTD కాలేజీల్లో కొత్త కోర్సులు..!

image

టీటీడీ పరిధిలోని జూనియర్, డిగ్రీ కళాశాల్లో వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి అందించే లక్ష్యంతో కోర్సులు తీసుకు రావాలని టీటీడీ విద్యాశాఖ అధికారులు చర్చించారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మీకు ఎలాంటి కోర్సులు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News January 14, 2026

బదోనే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్

image

సీనియర్లను కాదని వాషింగ్టన్ సుందర్ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు <<18835903>>ఆయుష్ బదోని<<>>ని సెలక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరణ ఇచ్చారు. ఇండియా-A టీమ్‌లో బదోని పర్ఫార్మెన్స్ బాగుందని.. IPLలోనూ రాణించినట్లు గుర్తుచేశారు. రైట్-ఆర్మ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ అయిన బదోని.. సుందర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయగలడని భావించినట్లు వివరించారు.