News January 3, 2026

అన్నమయ్య జిల్లాలో 92 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

అన్నమయ్య జిల్లాలో 92 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 56, టైప్-4 కేజీబీవీల్లో 36 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

Similar News

News January 11, 2026

దేశంపై నమ్మకం ఉంచండి: పీయూష్ గోయల్

image

భారత్‌తో ట్రేడ్ డీల్ ఆలస్యం కావడానికి మోదీ ఫోన్ <<18809902>>చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. దేశంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు. ‘మీ దేశాన్ని, మాతృభూమిని విశ్వసించండి. విదేశీయుల ప్రకటనలను కాదు. ట్రేడ్ డీల్ చిక్కుల గురించి మీడియా ముందు మాట్లాడుకోరు. రహస్యంగానే చర్చిస్తారు’ అని ఆయన స్పష్టం చేశారు.

News January 11, 2026

వీరభద్రస్వామి ఉత్సవాలకు తరలిరావాలి: మంత్రి పొన్నం

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిరావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

News January 11, 2026

ADB: మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా KTR, హరీశ్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ASF ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.