News January 3, 2026
సిక్ లీవ్ అడిగితే లైవ్ లొకేషన్ షేర్ చేయమన్న మేనేజర్

తీవ్రమైన తలనొప్పితో సిక్ లీవ్ అడిగిన ఒక ఉద్యోగికి తన మేనేజర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. లీవ్ కావాలంటే వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ షేర్ చేయాలని మేనేజర్ పట్టుబట్టారు. దీంతో షాకైన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని Reddit వేదికగా వాట్సాప్ స్క్రీన్‌షాట్లతో సహా పంచుకున్నారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ నెటిజన్లు మేనేజర్ తీరును, అక్కడి వర్క్‌కల్చర్‌ను తప్పుబడుతున్నారు.
Similar News
News February 7, 2026
ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
News February 7, 2026
100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయ్!

100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ RTIకి సమాధానమిచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేవు. ఈ నగరాల కోసం పదేళ్లలో ₹59,385Cr ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గరపడినట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీస్‌గా మారేందుకు టైమ్ పడుతుందని పేర్కొంది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.
News February 7, 2026
ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ తమిళం: మోదీ

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం తమిళం అని ప్రధాని మోదీ అన్నారు. తమిళ సాహిత్యం, సంస్కృతి చాలా గొప్పవని మలేషియా పర్యటనలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. మానవాళికి తమిళ ప్రజలు తమదైన ప్రతిభతో సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా కేంద్ర క్యాబినెట్‌లో కీలక స్థానంలో తమిళులు ఉండడం గర్వంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత సంస్కృతి అని గుర్తుచేశారు.


