News January 3, 2026

అన్నమయ్య: డ్రోన్ కెమెరాతో తనిఖీలు

image

అన్నమయ్య జిల్లాలోని విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె, పీలేరు, రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యా సంస్థలవద్ద డ్రోన్‌తో శుక్రవారం తనిఖీలు చేశారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్‌ను అరికడతామన్నారు.

Similar News

News January 5, 2026

తిరుపతి: రూ.100కి రూ.40 వడ్డీ.. ప్రశ్నిస్తే హత్యాయత్నం.!

image

ఏర్పేడు మండలంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు హద్దు దాటుతున్నాయి. రూ.100కు రూ.20-40 వరకు వడ్డీ వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారట. అప్పు తీర్చకపోతే బైకులు, విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుంటున్నారట. పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తామంటున్నారట. దీంతో బాధితులు బయటికి రాలేక అధిక వడ్డీలకు బలవుతున్నట్లు సమాచారం. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?

News January 5, 2026

పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News January 5, 2026

KNR: సీతక్కా.. ఎగ్ బిర్యానీ పథకం ఎత్తేశారా?

image

అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా జూన్ 11న ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజులోనే అటకెక్కింది. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు వారానికి 2సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తామని అధికారులు ప్రకటించినా.. ఆచరణలో అమలు కావడం లేదు. దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవంటూ చేతులెత్తేస్తున్నారు. ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీ కేంద్రాల్లో 1,80,112 చిన్నారులు, 40,160 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు.