News January 3, 2026
అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Similar News
News January 23, 2026
MBNR: సంక్రాంతి వేళ ఆర్టీసీకి భారీ ఆదాయం.!

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 9 నుంచి 20 వరకు 794 ప్రత్యేక బస్సులను నడపగా, సంస్థకు ₹22.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు రీజనల్ కో-ఆర్డినేటర్ సంతోష్ కుమార్ తెలిపారు. సుమారు 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్‌లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.
News January 23, 2026
పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.


