News January 3, 2026

పొగ మంచు ఎఫెక్ట్.. కోనసీమను తలపిస్తున్న వేములవాడ

image

దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వేములవాడ పట్టణం కోనసీమ అందాలను తలపిస్తోంది. తిప్పాపూర్ వేములవాడ మధ్యన ఉన్న బ్రిడ్జి, తిప్పాపూర్ లోని ప్రధాన బస్టాండ్ తదితర ప్రాంతాలు పొగమంచులో లీలగా మాత్రమే కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుండి ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బంది పడగా, మార్నింగ్ వాక్ కు వెళ్లినవారు ఈ ఆహ్లాద దృశ్యంతో ఆనంద పరవశులయ్యారు.

Similar News

News January 19, 2026

విశాఖ వ్యాలీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2026

రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 19, 2026

పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

image

అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో నం.3 పొజిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(12,676) నిలిచారు. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచులో సెంచరీతో ఈ రికార్డును చేరుకున్నారు. 60+ సగటుతో 93కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆయన కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(12,662), సంగక్కర(9,747), కల్లిస్(7,774), కేన్ విలియమ్సన్(6,504) ఉన్నారు.