News January 3, 2026

యాదాద్రి: నేటి నుంచే ‘టెట్’.. సర్వం సిద్ధం

image

టెట్ శనివారం నుంచి ఈనెల 31 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో జరగనుంది. ప్రతిరోజూ 2 విడతల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2.30-5) పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,852 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, దేశ్‌ముఖి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో మాత్రం 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News January 14, 2026

పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

image

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.

News January 14, 2026

3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజలతో భేటీ అవుతారు. గురువారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, శుక్రవారం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావున అధికారులు, కార్యకర్తలు గమనించి డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోరారు.

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.