News January 3, 2026
వికారాబాద్: అక్కడ 365 రోజులు సంక్రాంతి!

సాధారణంగా సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడుతారు. కానీ, ఆ ప్రాంతానికి వెళితే 365 రోజులు సంక్రాంతిలా అనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ తండా ప్రజలు ప్రతిరోజు తమ ఇంటి ముందు ముగ్గు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మపై పువ్వు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం మొత్తం ఇలా చేయడం ఈ తండా వాసుల ప్రత్యేకత. ఏళ్ల ఆచారాన్ని ఇలా కొనసాగిస్తున్నారు.
Similar News
News January 8, 2026
మన్యం: ఆ రోజుల్లో బోగి పిడకలు తయారీ చేయడానికి పోటి పడేవాళ్లం

సంక్రాంతి పండుగ అంటే పిల్లలు హడావుడి అంతా ఇంతా కాదు. నెల రోజులు ముందు నుంచే పిల్లలు తమ స్నేహితులతో కలిసి ఆవు పేడను సేకరించి బోగి పిడకలు తయారీ చేసుకొనే పనిలో ఉండేవారు. బోగి రోజు ఎవరు ఎంత పెద్ద దండ వేస్తారో అని పోటి పడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సీతానగరం (M) బక్కుపేట టీచర్స్ బోగి మంటలలో సహజ సిద్ధమైన ఆవు పిడకల వేస్తే పర్యావరణానికి మంచిదని అవగాహన కల్పిస్తున్నారు.
News January 8, 2026
సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్?

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని సమాచారం. తెలుగులో ‘రాజాసాబ్’, ‘MSVPG’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండటం ‘పరాశక్తి’కి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ సమస్యతో సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
News January 8, 2026
రంగశాయిపేట నుంచి కాపుల కనపర్తి రోడ్డు మూసివేత?

మామునూర్ ఎయిర్‌పోర్టు రన్‌వే కోసం రంగశాయిపేట నుంచి కాపులకనపర్తి వరకు రాకపోకలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. రన్‌వే 3 KM పొడవు కారణంగా R&B రోడ్డు 5 కి.మీ పోతోంది. దీంతో రాకపోకలకు తీగరాజుపల్లి, ఊకల్, గీసుగొండ వైపు ప్రత్యామ్నాయం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం రంగశాయిపేట నుంచి చింతనెక్కొండ 26.4 KM ఉండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం చింత నెక్కొండ నుంచి ఊకల్, WGL 39 KM దూరం ఉండనుంది.


