News January 3, 2026

కొత్తగా రైల్‌వన్ యాప్.. పాత సీజన్ పాస్, వ్యాలెట్ల పరిస్థితేంటి?

image

UTS(అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో లోకల్ రైళ్ల నెలవారీ పాస్‌ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే నిలిపేసింది. రైల్‌వన్ యాప్‌ ఉపయోగించాలని చెప్పింది. దీంతో ప్రస్తుత సీజన్ పాస్, R-వ్యాలెట్ బ్యాలెన్స్ ఏమవుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ‘ఇప్పటికే తీసుకున్న పాస్‌లు గడువు ముగిసేదాకా చెల్లుతాయి. UTSలో ఇకపైనా జనరల్, ప్లాట్‌ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు’ అని రైల్వే క్లారిటీ ఇచ్చింది.

Similar News

News February 12, 2026

ఉప్పుతో పిల్లలకు ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

image

చిన్న పిల్లల ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఏడాదిలోపు పిల్లల కిడ్నీలు సున్నితంగా ఉండటం వల్ల ఉప్పును తట్టుకోలేవు. తల్లి పాలతో పాటు సహజ ఆహారంలో ఉండే సోడియం వారికి సరిపోతుంది. చిన్నప్పుడే ఉప్పు అలవాటు చేస్తే పెద్దయ్యాక BP, గుండె సమస్యలు రావొచ్చు. చిరుతిళ్లకు బదులు పండ్లు, కూరగాయలు అలవాటు చేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని సూచిస్తున్నారు.

News February 12, 2026

ఢిల్లీలో TG CM రేవంత్ మీడియా చిట్ చాట్

image

* ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది నా వ్యక్తిగత డిమాండ్.. ఆయన జాతి సంపద
* ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలి
* ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలేవీ తగలబడలేదు
* శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించాలని కేంద్రాన్ని కోరా.. అందుకు 600 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం.

News February 12, 2026

ఇషాన్ విధ్వంసం.. వరుసగా 6, 6, 6, 6, 4

image

టీ20 WCలో నమీబియాతో మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. స్మిత్ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. 6 ఓవర్లకు భారత్ స్కోర్ 86-1.