News January 3, 2026

నేడు ఉల్లి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్‌లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఈరోజు జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

JEE ఫలితాలు వచ్చేశాయ్

image

జేఈఈ-2026 ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని NITలు, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏపీకి చెందిన నరేంద్రబాబు, పసల మోహిత్, తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు <>సైట్<<>>: https://jeemain.nta.nic.in/

News February 16, 2026

హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే ఇవి తినాలి

image

హార్మోన్లను సమన్వయం చేయాలంటే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు కలగలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనెలు తీసుకోవాలి. రోజూ రెండు తెల్లగుడ్డుసొనలు, వాల్ నట్స్ తీసుకోవాలి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులను రోజూ తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది.

News February 16, 2026

పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

image

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.